Header Banner

ఏవండోయ్ మాస్టర్ గారు, మేడంగారు అదిరిపోయే ఆఫర్ తెచ్చానండి బాబు.. అతి తక్కువ ధరకే శ్రీలంక టూర్!

  Sun Feb 23, 2025 15:26        Travel

పొరుగుదేశం శ్రీలంక ప్రకృతి అందాలతో నిండిఉంటుంది. అందువల్లే మన దేశంనుండి శ్రీలంక సందర్శనకు చాలామంది ప్రకృతి ప్రేమికులు వెళుతుంటారు. అయితే సముద్ర అందాలను ఆస్వాదిస్తూ శ్రీలంకకు వెళ్లడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. కేవలం రూ.4,250 కే తమిళనాడు నుండి శ్రీలంకకు షిప్ లో వెళ్లవచ్చు. తమిళనాడులోని నాగై నుంచి శ్రీలంకలోని కాంకేసంతురైకి ప్యాసింజర్ షిప్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ను 2023లో ప్రధాని నరేంద్ర మోదీ స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం వాతావరణం అనుకూలించక నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఈ షిప్ సర్వీస్‌ను తాత్కాలికంగా ఆపేస్తారు. ఆ తర్వాత మెయింటెనెన్స్ పనులు పూర్తిచేసి తిరిగి ప్రారంభిస్తారు. ఇలా సుభమ్ కంపెనీకి చెందిన "శివగంగ" షిప్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ నాగై పోర్టు నుంచి ఇవాళ మళ్లీ స్టార్ట్ అయింది. 

 

ఇది కూడా చదవండి: మహాశివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులు! ఆర్టీసీ కీలక నిర్ణయం!

 

ఇవాళ ఫిబ్రవరి 22 శనివారం ఉదయం 6 గంటలకు పోర్టుకు వచ్చిన ప్యాసింజర్లను అధికారులు చెక్ చేశాక షిప్‌లోకి ఎక్కించారు. ఇలా షిప్‌లోకి చేరుకున్న ప్రయాణికులకు సిబ్బంది రోజా పువ్వులు ఇచ్చి సాదర స్వాగతం పలికారు.  నాగై నుంచి శివగంగ షిప్‌లో 83 మంది ప్యాసింజర్లు ఉదయం శ్రీలంకకు వెళ్లారు. అలాగే మధ్యాహ్నం శ్రీలంకలోని కాంకేసంతురై నుంచి నాగైకి బయలుదిన షిప్‌లో 85 మంది ప్యాసింజర్లు ఇండియాకు వచ్చారు. ప్యాసింజర్లను అట్రాక్ట్ చేసేందుకు శ్రీలంకకు వెళ్లడానికి ఒకవైపు టికెట్ ధర 4250 రూపాయలు, రెండువైపులా కలిపి 8,500 రూపాయలుగా  ఫిక్స్ చేశారు. ఈ షిప్ లో ప్రయాణించే ప్యాసింజర్లకు ఉదయం, మధ్యాహ్నం భోజనం ఫ్రీగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఒక ప్యాసింజర్‌కు 10 కిలోల వరకు సామాన్లు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు. ఎక్కువ లగేజ్ ఉంటే కిలోకు 50 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తారు. శ్రీలంక, ఇండియా మధ్య మంచి సంబంధాలు ఏర్పడాలనే ఈ షిప్ సర్వీస్‌ను స్టార్ట్ చేసినట్లు షిప్ కంపెనీ డైరెక్టర్ సుభశ్రీ సుందర్‌రాజ్ చెప్పారు. త్వరలోనే 250 మంది వెళ్లగలిగే ఫాస్ట్ షిప్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపారు.

 

ఇది కూడా చదవండి: జగన్ కి మరో షాక్.. కిడ్నాప్, హత్యాయత్నం కేసులో వైసీపీ నేత అరెస్టు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SriLanka #SriLankaTemple #SriLankaTempleViral #ViralImages #Viralnews #Ravana'sPalace